అట్ట – తల త్రెగిన మొండెము (Torso)

అటకలి – నూనెజిడ్డు పోగొట్టబడెడి వస్తువు (Soap)

అడదడి – ప్రభుత్వము (Government)

అతనుడు – గొప్పవాడు (Grandee) (మిగిలిన పదములు: ఉదాత్తుడు, ఘనుడు, పేరిమికాడు, మహనీయుడు, గఱువ, దొర)

అత్యంతీనుడు – విచ్చలవిడి నడుచువాడు (Debased man)  (లోలుడు,లోలుపుడు, మిక్కిలి ఇచ్ఛగలవాడు (లోలుపుడు, లోలుభుడు))

అత్యాహితము – మిక్కిలి వెరుపు  (Timid)

ఆదర్శనము – కల (Dream) (మిగిలిన పదములు: స్వప్నము)

అద్మర్ముడు – తిండిపోతు (Glutton) (మిగిలిన పదములు: భక్షకుడు, మేపరి, ఆబూతికాడు, ఘస్మరుడు, బోరెంపోతు)

అధివిన్న – మొదటి పెండ్లాము (First wife)

అనంగుడు – అంగము లేనివాడు (Person without limb)

అనక్షరము – తిట్టు (Damn, Abuse)

అనపత్యుడు – బిడ్డలు లేనివాడు (Infertile man)

అనకు – ముద్దగా కాక పలుచనైనది (Gravy)

అనుపరి – సుంకము తీయువాడు (Taxman)

అనులాపము – మాటిమాటికి చెప్పుడు మాట, ఊతపదం (Swear word)

అనువరి – ఉపాయశాలి (Intelligent)

అన్నగళ – నపుంసకుడు (Impotent)

అన్యతరము – రెండింటిలో ఒకటి (Either)

అపూపము – పిండి వంట (?)

అభిజనము – పుట్టిన చోటు (Native Place)

అభిద్య – పరధనమునందు ఆపేక్ష

అభినివేశము – చొరవ

అభినీతము – న్యాయముతో కూడినది (Legitimate)

అభిభూతము – తిరస్కరింపబడినది (Rejected)

అభిమర్శనము – నిమురుట (Caress)

అభూతము – జరగనిది, అసంభవము (impossibility)

అమాంతగాడు – చిల్లరబేరగాడు (Retailer)

అమేధ్యము – పవిత్రము కానిది (Unholy)

అయోగము – ఎడబాటు

అయోనిజుడు – గర్భము నందు పుట్టనివాడు

అరగడి – కురచగోడ

అరము – బండికంటియాకు (Spoke)

అరముడి – మాటిమాటికి (Frequent)

అర్వాచీనము – క్రిందనుండునది

అవకరము – కసువు (Trash)

అవతమసము – తగ్గిన చీకటి (Dim)

అవదానము – కడచిన పని

 

ఇందులో కొన్ని పాత తెలుగు పదాలు అనగా అర్థమున్నప్పటికీ వాడకలో లేని వాటిని, వాటికి సంబంధించిన ఆంగ్లపదం వ్రాయడమైనది. చాలామంది భావనలో ఆంగ్లంలో ఉన్న పదానికి సరైన తెలుగు పదం ఉండదని ఓ చిన్నచూపు. అది నిజమే. కారణం ఆంగ్లం అంతర్జాతీయ భాష. అలాగే కొన్నికొన్ని తెలుగు పదాలకు సరైన ఆంగ్లపదం దొరకటం కష్టమే. ఏ భాష గొప్పదనం దానిదే.

 

 

నమస్కారమండి. ఇది తెలుగు ప్రతిలిపి, ఇక్కడ తెలుగు భాషకు సంబంధించిన రచనలు ఇక్కడ ప్రచురించ బడుతాయని తెలుసు. తెలుగు భాషపై ఉన్న మమకారంతో నా వంతు కృషిగా ఇక్కడ కొన్ని ఇంగ్లీషు పదాలు, అలాగే వాటిని వివరించే తెలుగు పదాలు వ్రాస్తున్నాను.

 

వాటిల్లో కొన్ని తెలిసిన ఇంగ్లీషు పదాలు ఉండొచ్చు. అలాగే కొన్ని తెలుగు పదాలు తెలిసి ఉండొచ్చు. కానీ నా ఉద్యేశ్యం ఏమిటంటే కొందరికి చక్కగా తెలుగు పదం తెలిసి ఉంటుంది. కానీ దానికి సరైన ఇంగ్లీష్ పదం తెలియదు. అటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న వారి పిల్లలకు తెలుగు పదాన్ని ఇంగ్లీషులో చెప్పలేక ఇబ్బంది పడవచ్చు. అలాగే ఇంగ్లీషు లో పిల్లలు ఆ పదం వాడితే దానికి తెలుగులో ఎలాంటి అర్థం వస్తుందో తెలియక కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఈ సమస్య పిల్లలు, పేరంట్స్ మధ్యే కాకుండా టీవీ సీరియల్, సినిమా, న్యూస్ ఇలా ఎక్కడైనా ఎదురవ్వవచ్చు.

 

ఇంకా రచనలు చేసేవారు పైపై అనువాదం (లూజ్ ట్రాన్సిలేషన్) కాకుండా మరింత విస్పష్టమైన పదాన్ని గుర్తించుతారని ఆశించి వ్రాసిన రచన ఇది.

 

ఇలా వీలైనప్పుడల్లా కొన్ని కొన్ని పదాలతో ఇకపై రచనలు చేస్తుంటాను. ఆసక్తి గల వారు ప్రయోజనం పొందవచ్చు. సూచనలు సలహాలకు సదా ఆహ్వానం.

 

 

1Adlib – అశువుగా చెప్పు (అంటే అప్పటికప్పుడు ఏదేని విషయం పై మాట్లాడు)

2Admonish – నిగ్గదీయు, కడుగు, నిలదీయు (అంటే ఎందుకు ఇలా చేసావని నిలదీయుట)

3Adobe – ఇటుక ముద్ద (అంటే ఇటుక తయారు చేయడానికి బంకమన్ను, గడ్డి, బూడిద వంటి కలిపి నీరుపోసి త్రొక్కిన ముద్ద)

4Adulation – ముఖస్తుతి (అంటే మనసులో మెచ్చుకోవాలని లేకున్నా ఇబ్బందిగా మెచ్చుకోవడం)

4Advance – సంచకరువు, అచ్చారము, బయానా (అంటే ఒప్పుకొన్న డబ్బులో కొంత ముందుగా చెల్లించబడునది)

5Adversity – దుస్థితి, గడ్డుకాలం (అంటే అనుకూలంగా లేని కాలము లేదా స్థితి)

6Affable - సుఖముగా మాట్లాడనిచ్చు, స్నేహమర్యాదలు గల

7Affection – అనురాగము, కెలవు, కాయువు

8Afternoon – మధ్యాహ్నం, అపరాహ్ణము, లేబ్రొద్దు, వాలుప్రొద్దు

9Agape – నోరెళ్లబెట్టిన (అంటే భయం చేత లేదా ఆశ్చర్యం చేత నోరు తెరచినట్లు)

10Agent - తరగరి, దలారి, దలాలి, దళారి (అంటే ఒకనికి మారుగా పనిచేయువాడు)

11Agile - లాఘవమైన, లివమైన (అంటే మ్యాజిక్ లా, మాయలా చాలా సులువుగా, తర్వితముగా చేసెడి)

12Agony – యాతన (అంటే చాలా పెద్ద బాధ లేదా నొప్పి)

13Airborne – విహంగమైన (అంటే గాలిలో ఎగిరెడి)

14Alcove - గోడలోని గూడు, గూటు

15Allay – ఓదార్చు, స్వాంతన పరుచు (అంటే బాధ పడుతున్న, ఏడుచున్న వారిని అలా చింతించ వద్దని చెప్పు)

16Allegiance – విశ్వాసం (అంటే మతం పట్ల, వ్యక్తి పట్ల, ఆచారం పట్ల, దేశం పట్ల ఇలాంటి ఏదేని విషయాలలో నమ్మకం)

17All go – హడావిడి (అంటే ఒక వేడుక సమయంలోగానీ, రోజువారి పనుల్లోగానీ బిజిబిజీగా ఉండటం)

18All-out – కసితో గానీ, మొండితనంగా గానీ చేసెడి (అంటే ఉదాహరణ అమ్మ కోప్పడిందని హోం వర్క్ మొత్తం కసిగా చేసి చూపడం, ఒప్పచెప్పడం వంటివి)

19All-star – హేమాహేమీలైన, అతిరధులైన, తారాగణ (అంటే ఆయా రంగంలో ప్రసిద్ధులైన సమూహం)

20Allude – నర్మగర్భంగా ప్రస్తావించు, పరోక్ష ప్రస్తావన చేయు (అంటే మిగతా విషయాలతో పాటు పైకి కనపడని విషయాన్ని చెప్పు)

21Already – మునుపే, క్రితమే

22Also-ran – పరాజితుడు (అంటే పోటీ పడి ఓడిపోయిన వాడు)

23Altercation – వాదులాట

24Always - సదా , ఎల్లప్పుడు , అనవరతముగా , అజస్రముగా , అనారతముగా , అనిశముగా , అవిరతముగా, నిరంతరముగా, అశ్రాంతముగా, సతతముగా, సంతతముగా

హసంతి – కుంపటి

హల్లీసకము – బాలెడ్ డాన్స్

స్ఫిక్కు – నడ్డి

సాగవేయు – Deliver

సంవాహకుడు – ఒళ్లుపిసుకువాడు (Massager)

సంజనము – Apartment

సంకుసుకుడు – Fickle mind person

సంకాశము – సమానమైనది, సమీపమైనది

శింబ – పైపొట్టు

శాతోదరి – Zero size woman

శకృత్కరిలేగదూడ    దూడ, లేగ, పెయ్య, దోగ్థ heifer

శంబలము – దారిభత్యము (Travelling Allowance)

వైతనికుడు - Daily wager

విజ్ఞోడుజోడుకానిది

విచ్చ     నాలుగువేళ్ళకు చుట్టి తీసిన నూలి చుట్ట

వికుర్వాణుడు     సంతోషమునొంది మనస్సుకలవాడు

వల్లిగము          బొక్కెనమీది యినుప వలయము

లౌనసు, లవనసు -  జీవనార్థమైయిచ్చు ద్రవ్యము (Dearness Allowance)

యూషము        పప్పుకట్టు

యాదాస్తు         ఆజ్ఞాపూర్వకమైన యుత్తరము

యథాయథలు     చెల్లాచెదురు

మ్రక్షము తన తప్పును మఱుగు పుచ్చుట

మాతృక – Original

భిస్సటు మాడన్నము Singe rice

భర్తృనము         బెదరింపుమాట

బన్నసరము      నానావిధములయిన మణులు గ్రుచ్చిన హారము

బధ్యము నీళ్లురాకుండకట్టిన కట్ట

బధ్యుడు చావదగినవాడు

బద్దించు కొలిచినది తిరుగ కొలుచు

 

 

బంకు    శూరునివలె నటించువాడు

ప్రయుతము       దశలక్ష సంఖ్య

ప్రమీల   కునికిపాటు

ప్రతోళి    పెద్దవీధి

 

పౌరోగపుడు       వంటయింటి అధికారి

పురోభాగి ఎప్పుడును తప్పులు వెదుకువాడు

పిటకము          చిన్నపెట్టె          చిన్నగంప

పరివిత్తి  తమ్మునికి పెండ్లియయి తనకు లేకుండెడి యన్న

పందిపీట గాడీ మొదలగు ఎక్కుడుబండ్ల చివరను పందిమూతివలె మ్రానలోనగువానితో జేసి యమర్చిన పరికరము

పంచపాక          ఇంటి ప్రక్క వంచి కట్టిన కట్టడము

నెమ్ము  తడి      పలకలులోనగునవి యంటువేయలోపలజొప్పించెడు మేకులు     బండి చక్రముల రంధ్రములయందు చొప్పించెడు ఇనుపగొట్టములు

నిర్ఘటము          బహుజనసమ్మర్థముగల అంగడి

నిరుకు  నిర్ఱయము        నిర్ఱయముచేసిన వెల

నిరకు    అంగడివెల

నవి      కరగోడపెట్టుటకు నిడుపున త్రవ్వియెత్తిన మట్టి పల్లము

నక్రము  అడ్డకమ్మి          త్రొక్కుడుగమ్మి

దిధిషువు          మాఱుమనువుది మాఱుమనువుదానిమగడు

తారి      ఆటాడించెడు సూత్రదారి

తంబుగ  మెడ     నిడుపుగానుండెడు చెంబు

టిర్రి      మోసెడు జంతువు

టంకు    నాగరికతకలవాడు

జవనము          వడిగలగుర్రము    వడిగలది

ఛేకము  పెంపుడుమృగము

ఛలము  నెపము  వెనుదీయుట      ఒకయభిపాయముతో చెప్పిన పదమునకు మరియొక యభిప్రాయముచేసికొని యుత్తురము చెప్పుట

 

 

 

 

 

 

చత్వరిక బాల విధవ

ఘాటు   సంరక్షక భటుల సముదాయము

ఘట్టము తీరము  సుంకము మొదలయినవి తీయుచోటు

గోళకుడు విధవకు ఱంకు మగనియందు పుట్టిన కొడుకు

 

Gofer – చెంచాగిరి చేసెడి వాడు

Gooey – 1) పాకమైన 2) గారాబమైన

Goof – చిన్న పొరపాటు

Gorge – 1) పీకలదాక తిను 2) (ఏదేని) మయ మగు (ఉదా. రంగులమయమగు, మరకలమయమగు)

Grouch – 1) నస 2) నసగాడు / నసగత్తె

Grove – చెట్ల తోపు

Guzzle - ఆబగా తిను లేదా త్రాగు

Hair-trigger - ముక్కోపమైన

Hobo – దిమ్మరి

Hold all – దస్త్రం

Honesty Box – హుండి

Horde – కోలాహల జనసందోహం (తిరునాళ్లు, ఉత్సవాలలో కనిపించెడిది)

Zit – మొటిమ

Yoof – కుర్రకారు

Yokel – పల్లెటూరిబైతు

Yes-man – డూడూ బసవన్నా

Yelp – గావుకేక

A yawn – చిరాకు తెప్పించు మనిషి లేదా విసుగు కలిగించెడిది

Yap – 1) కుయ్యోమొర్రో అని మొత్తుకొను 2) ఎదుటివాడికి అసహనం కలిగేలా పెద్దగా మాట్లాడు

Yank – గుంజు

Pull – లాగు

Yahoo – మొరటోడు

Wuss – పిరికిపంద

Wizened – వయసు లేక పక్వం చేత వచ్చిన ముడుతలు (పెద్దలకు గానీ, పండ్లకు గానీ)

Wrikle – ఏ కారణం చేతనైనా పడ్డ ముడత

Withering – తృణీకార లేదా తిరస్కార భావమున్న

Wired – పూటుగా మద్యం తాగో, మాదక ద్రవ్యం సేవించో, మంచి కాఫీ తాగో ఖుషీగా ఉన్న

Wiggly – కొద్దిపాటి వంపు ఉన్న

Whit – బొత్తి (చాలా కొంచెం)

Whine – ఆర్తితో ప్రార్థించు

Whim – తిక్క

 

Wrapper – ముడతల కాగితం

Wrap – చున్ని

Wistful – నిర్వేదమైన

Windfall – ఊహించని లాభం

Wince – అకస్మాత్తుగా మొహంలో బాధ కనిపించెడి

Wily – గడసరి (పొరపాటున Willy గా చెప్పకండి. దానర్థం పురుషాంగం)

Willowy – సన్నని నాజూకైన, రివటైన

Wet blanket – ఇతరుల ఆనందం పాడు చేయువాడు(ముచ్చుమొహపోడు)

Well off – సంపన్నమైన

Weeklong -  వారమంతా

Wee – ఇస్సుపొయ్యి (చిన్నపిల్లలచేత మూత్రం పోయటం)

Weasel out  - కుంటిసాకులు చెప్పు

Wean – (పిల్లలకు) పాలుమాన్పించు

Wart – చూపుడుకాయ

Warmonger – జగడగొండి, తగవులమారి

Wan – పేలవమైన

Wally – తంటరి (పొరపాటున Willy గా చెప్పకండి. దానర్థం పురుషాంగం)

Wallflower – ఏదేని కార్యక్రమంలో ఉన్నప్పటికీ దానిలో పాల్గొనని వ్యక్తి

Walkway – కాలిబాట

Waif – అనాకారి

Waggle – ఆడించు (ఉదా. కాళ్లు ఆడించడం, తలాడించడం)

Wag – 1) తోకూపు 2) తలూపు (ఒద్దన్నట్లు)

Waffle – వాచలించు, ఊదరగొట్టు

Wafer thin – అత్యంత సన్నం (రవపాళము)

Wade in – జోక్యం చేసుకొను

 

ఖేచరుడు – Astronaut

ఖసూచి – ప్రతిభలేని వాడు

కొటారము – Grain yard

కైకట్టు – సందర్భము, Case

కేళికీలుడు – Buffoon

కేళాకూళి – క్రీడాసరస్సు Swimming pool

కూటాగారము – Pent House

కుల్యుడు – Gentleman

కుముఖము – Tent

కుతస్త్యము – Vulgarity

అంపియ, చింపిగుడ్డ – Rag

అంసలుడు – Bouncer

అగవాళ్ళు Sandals

 

Wheedle – ముఖస్తుతి చేసి వంచించు, కాకాపట్టు

Whacked – డస్సిన

Votary – భక్తుడు, దాసుడు

Vociferate – గొంతుచించుకొను

Vixen, viragoగయ్యాళి (తిట్టుగా)

Vivacious – వయ్యారమైన

Kittenish - వగలుబోయెడి

Vitriolic – పెడసరమైన

Vitiate – 1) చిన్నబుచ్చు  2) చులకన చేయు

Vitamins – జీవసత్తులు

Village idiot -  వెర్రి వెంగళప్ప

Vicinity – దరిదాపు

Verdigris – చిలుము

Venial – మన్నించే లేదా మరిచిపోయే పొరపాటైన

Fashion – తొడరిక/ ఆదృతి

Trend పోకడ, ఒరవడి

knife-edge – ఉత్కంఠమైన సంకట స్థితి

 

kook – తింగరోడు

lag  - నచ్చుగా చేయి, నాన్చు

laity -